Friday, 13 February 2026

ఆకాశవాణి, కర్నూలు ఎఫ్ ఎం...


చిన్నప్పటినుంచే నాకు బాగా చదివే అలవాటుండేది. అదొక్కటే అప్పట్లో నాకున్న ఇష్టం, ఎడిక్షన్. 

తర్వాత ఇంకో రెండు మూడు ఇలాంటి ఇష్టాలు, ఎడిక్షన్లు యాడ్ అయ్యాయి...  

చందమామ, బాలమిత్ర, సోవియట్ ల్యాండ్, స్పుత్నిక్, సాక్షి వ్యాసాలు, విశ్వనాథ, బుచ్చిబాబు, చలం, లత సాహిత్యం, యధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కొమ్మూరి వేణుగోపాలరావు, ఆర్కే నారాయణ్, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య వంటివారి రచనలు ఎంత బాగా చదివేవాన్నో... విశ్వప్రసాద్, మధుబాబుల డిటెక్టివ్‌లు కూడా అంతే బాగా చదివేవాన్ని. 

రమణి, రసికప్రియ, కాగడా, విజయచిత్ర, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, స్క్రీన్ పత్రికలు కూడా వదల్లేదు.
    
దాదాపు వీటన్నిటికి పూర్తి వ్యతిరేక ధృవం అయిన కమ్యూనిస్ట్ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, అరుణతార, సృజన పత్రికలు కూడా రెగ్యులర్‌గా చదివేవాణ్ణి. దీని ప్రభావమే నా మీద ఎక్కువగా ఉండి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరినప్పుడు నేను ఆర్ యస్ యు (రాడికల్ స్టుడెంట్స్ యూనియన్) వైపు ఉండటానికి కారణమైంది. 

ఓయూలో పీజీలో చేరడానికి ముందు నేను ఒక మూడేళ్ళపాటు హెచ్ ఎం టి లో మెషినిస్ట్‌గా పని చేశాను. అప్పుడు - సీతాఫల్ మండి నుంచి హెచ్ ఎం టి దాకా కంపెనీ బస్‌లో వెళ్లే ఆ 45 నిమిషాల సమయంలో, బస్ ఎక్కగానే నిద్రపోకుండా, ఇంగ్లిష్ నవలలు చదవడం నాకు బాగా అలవాటయ్యింది.
  
అప్పట్లో సీతాఫల్ మండి, తార్నాకాల్లో ఇంగ్లిష్ నవలలు అద్దెకిచ్చే షాపులుండేవి. రోజూ ఒకే సమయానికి వెళ్ళి, అద్దెకు నవల్స్ తెచ్చుకొని చదవటం అప్పట్లో అదొక క్రేజ్.  
  
సిడ్నీ షెల్డాన్, హెరాల్డ్ రాబిన్స్, ఫ్రెడ్రిక్ ఫోర్సైత్, జెఫ్రీ ఆర్చర్‌ల ఫిక్షన్ బుక్స్ దాదాపు అన్నీ నేను చదివాను అన్న విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.
 
తర్వాత ఒక రెండేళ్ళు... నా ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం... నవోదయ విద్యాలయ (గుంటూరు) లో పనిచేశాను. కాని, అది రెసిడెన్షియల్ సెటప్ కాబట్టి ఎక్కువగా చదివే అవకాశం అక్కడ నాకు ఉండేది కాదు. 

అక్కడి కొలీగ్స్, స్టుడెంట్స్, పరిచయాలు, ఏదో ఓ పని, లైబ్రరీ క్లాసులు, సాయంత్రం మద్దిరాల వాగులో ఫిషింగ్... అదంతా వేరే ఇంకో అద్భుత జ్ఞాపకం. 
  
కట్ చేస్తే - 

వీటన్నిటికి దూరంగా... అప్పటివరకు నాకు తెలియని-లేదా- నేను పట్టించుకోని ప్రపంచ సాహిత్యంతో, ప్రపంచస్థాయి నో-హిపోక్రసీ సీరియస్ సాహిత్యంతో నాకు బాగా పరిచయమైంది ఆలిండియారేడియో లైబ్రరీలో!

నా మూడో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో నేను దాదాపు ఒక పదేళ్ళు పనిచేశాను. ఆ టెన్-టూ-ఫైవ్ ఉద్యోగంలో, నాకు జస్ట్ ఒక రెండు మూడు గంటలకంటే అసలు పని ఉండేది కాదు. మిగిలిన టైమంతా లైబ్రరీలోని పుస్తకాలతో గడిపేవాణ్ణి. 

షేక్స్‌పియర్, విక్టర్ హ్యూగో, దస్తయేవ్‌స్కీ, మిల్టన్, జేన్ ఆస్టిన్, జేమ్స్ జాయ్స్, జార్జ్ ఆర్వేల్, నీషే, మిలన్ కుందేరా, కుశ్వంత్ సింగ్, సాల్మన్ రష్దీ, అగాథా క్రిస్టీ, అరుంధతీ రాయ్, నాన్సీ ఫ్రైడే, శోభా డే, డానియెల్ స్టీల్, మారియో పుజో, పావ్‌లో కోయిల్యూ, గోర్కీ, పవుస్తోవ్‌స్కీ, మార్క్ ట్వేన్, బెర్నార్డ్ షా, ఆల్బర్ట్ కామస్, ఐన్ రాండ్, రారా, కొకు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, డాక్టర్ సినారె, తాపీ ధర్మారావు వంటి ఎంతో మంది రచనల్ని నేను కర్నూల్లోనే చదివాను.

నా జీవితం మొత్తంలో నేను ఎక్కువగా పుస్తకాలను చదివింది కూడా కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే. 

థాంక్స్ టూ ఎస్ పి గోవర్ధన్ గారు... అప్పటి మా స్టేషన్ డైరెక్టర్... ఆయనకు కూడా బాగా చదివే అలవాటుండేది. వొరేషియస్ రీడర్! దాదాపు ప్రతి రెండు నెలలకొకసారి మా లైబ్రరీకి కొత్త బుక్స్ ఆర్డర్ పెడుతుండేవారు.

గోవర్ధన్ గారు నాకు ఎప్పుడూ "ఇది చదువు, అది చదువు" అని అసలేం సజెస్ట్ చేసేవాడు కాదు. కాని, ఆయన పెట్టే పుస్తకాల ఆర్డర్‌లో మాత్రం నా టేస్టును బట్టి కూడా బుక్స్ బాగానే కనిపించేవి. 

అప్పట్లో సికింద్రాబాద్ "బుక్ సెలక్షన్ సెంటర్" నుంచి మాకు రెగ్యులర్‌గా "న్యూ అరైవల్స్" క్యాటలాగ్స్ వచ్చేవి. మా సర్ నన్ను కూడా సెలక్ట్ చెయ్యమనేవారు. ఇంకేముంది... పండగే!  
స్వయంగా నేనే ఎన్ని బుక్స్ సెలక్టు చేశానో, ఎన్ని చదివానో చెప్పలేను.   

అప్పటి మా ఫార్మ్ రేడియో ఆఫీసర్ లక్ష్మి రెడ్డి గారు, మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రి, స్టెనోగ్రాఫర్ లక్ష్మి కూడా... అప్పుడప్పుడూ, వారి ఫ్రీ టైమ్‌లో, ఏదో ఒక పుస్తకం చదువుతుండేవారు. 

గాడ్‌ఫాదర్ నవల్లోని క్యారెక్తర్స్ గురించి శాస్త్రి బాగా చర్చించేవాడు నాతో. 
 
ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిత్రుడు అపోలిన్ డిసౌజా మాతృభాష కొంకణి. మంగళూరు నేటివ్ కాబట్టి సహజంగానే అతనికి కన్నడ కూడా తెలుసు. కన్నడ లిపి, తెలుగు లిపి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగు లిపికి సంబంధించి డిసౌజాకు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాను. అంతే. తన మాతృభాష తెలుగు కాకపోయినా, తెలుగు నేర్చుకొని, దాదాపు లైబ్రరీలో ఉన్న పాపులర్ తెలుగు నవల్స్ అన్నీ చదివేశాడు! 

ఇక రాయడం విషయానికొస్తే - 

యూనివర్సిటీలో స్టుడెంట్‌గా ఉన్నప్పుడే నేను రాయడం ప్రారంభించాను. బాగా అలవాటయ్యింది కూడా క్యాంపస్‌లోనే. నేను రాసినవి న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్స్‌లో అచ్చయ్యేవి. 150, 200, 250... పారితోషికం మనీయార్డర్స్ రూపంలో వచ్చేది.

అయితే - కథలు రాయడం సీరియస్‌గా ప్రారంభించిందీ, ఎక్కువగా రాసిందీ కూడా నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే!
   
ఆ సమయంలోనే నేను రాసిన ఒక కథ పబ్లిష్ అయినప్పుడు, అది అన్నలకు కోపం తెప్పించి, ఒక విరసం రచయిత ద్వారా నాకు మైల్డ్‌గా వార్నింగ్ పంపించేదాకా వచ్చింది. 

ఆంధ్రభూమిలో పబ్లిష్ అయిన నా ఇంకో కథ... నాకు మద్రాస్ నుంచి కాల్ చేయించి, సినిమారంగానికి కనెక్ట్ చేసింది. 

కర్నూల్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడే నేను "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తం రాశాను. దానికి ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించింది కూడా నేను అక్కడ ఉన్నప్పుడే.  
     
కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు నేను కొన్ని ఫీచర్స్, నాటికలు కూడా రాశాను. ప్రసారం అయ్యాయి.  బహుశా ఆ స్పూల్ టేప్స్ ఇంకా అక్కడి టేప్స్ లైబ్రరీలో ఉండే ఉంటాయి. 

ఆమధ్య రెండుమూడుసార్లు నేను బెంగుళూరు నుంచి హైద్రాబాద్‌కు కార్లో వస్తున్నప్పుడు కొన్ని గంటలు కర్నూల్లో ఆగాను. అప్పుడు నేనున్న క్రిష్ణారెడ్డి నగర్‌కు వెళ్ళి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి మా నైబర్స్‌ను కలిశాను. చలపతి దాబాకు వెళ్ళాను. అదొక గొప్ప అనుభూతి.   

మా కర్నూలు ఎఫ్ ఎం రేడియో స్టేషన్‌కు కూడా వెళ్లాలనుకున్నాను కాని, కుదర్లేదు. 

నేను పనిచేసిన కర్నూలు ఆలిండియా రేడియో స్టేషన్‌ను మళ్ళీ ఒకసారి తనివితీరా చూడ్డం కోసమే, ఈసారి స్పెషల్‌గా, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని చాలా ఏళ్ళుగా అనుకొంటున్నాను. నా అప్పటి కొలీగ్ మిత్రులు... మా  మోహన్ రెడ్డి, కామేశ్‌తో కలిసి అదెప్పుడో ఒకసారి త్వరలోనే జరుగుతుంది.  

మర్చిపోయాను... నేను కర్నూలు రేడియోలో పనిచేస్తున్నప్పుడే మా ఎనౌన్సర్ శ్యామసుందర శాస్త్రితో కలిసి, ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్‌ను మా స్టుడియోలో ఇంటర్వ్యూ చేశాను. బహుశా ఆ స్పూల్ టేప్ కూడా ఇప్పటికీ ఉండే ఉంటుందక్కడ. 

ఇలాంటి ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చిన కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎం లో నేను పనిచేసిన రోజులను మళ్ళీ గుర్తుచేసుకోడానికి కారణమైన ఇవాళ్టి "వరల్డ్ రేడియో డే" కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? 

అప్పటి నా రేడియో కొలీగ్స్‌కు, ఇప్పుడు రేడియోలో పనిచేస్తున్నవారందరికీ... వరల్డ్ రేడియో డే సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!

- మనోహర్ చిమ్మని 
        
(#WorldRadioDay సందర్భంగా 2022లో నేను రాసిన బ్లాగ్ పోస్ట్, స్వల్ప మార్పులతో!)   

Be Love, Not Just In Love


“It’s not a question of being in love with someone. It’s a question of being love.”
— Osho

Valentine’s Day is not just about finding the right person. It is about becoming the right presence.

Being in love is beautiful.
But being love is powerful.

When you are love — in your thoughts, in your words, in your silence — every relationship becomes sacred. Not because of who stands beside you, but because of what flows from within you.

This Valentine’s Day, don’t just celebrate a person. Celebrate the love you are capable of being.

Tell me — are you looking for love, or are you becoming it? 

- Manohar Chimmani 

Wednesday, 11 February 2026

మనకు తెలియకుండా మన చుట్టూనే ఎన్నెన్నో...


ఇవ్వాళ సాయంత్రం ఒక మిత్రున్ని కలిశాను.

చాలా రోజుల తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన మీటింగ్. 

కష్టాలు, కన్నీళ్ళు, టెన్షన్లు కాసేపు ఒకరికొకరం చెప్పుకొన్నాం. చెరొక కపచీనో ముందు పెట్టుకొని ఒక రెండు గంటలపాటు మాట్లాడుకున్నాం.

కట్ చేస్తే -

కొన్ని విషయాలు వింటుంటే అసలు మనం ఎక్కడున్నాం అని వొళ్ళు గగుర్పొడుస్తుంది భయంతో. మనకు తెలియకుండా మన చుట్టూనే ఎన్నెన్నో జరుగుతున్నాయి.  

సినిమాల్లో మనం చూస్తున్నది, చూపిస్తున్నది చాలా చాలా తక్కువ.  

We live in society with open eyes, yet move through it blind — seeing everything, understanding nothing.

- మనోహర్ చిమ్మని      

"డబ్బుదేముంది?" అని నీతో ఎవరైనా అన్నారా...


సక్సెస్, మనీ ఉన్నచోటే గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది.  

మనీ మాట్లాడుతున్నప్పుడు ఏ గ్రామర్ తప్పు కనిపించదు. 

నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు కాదు. 
నాకు ఇన్ని తెలుసు, అన్ని తెలుసు కాదు. 
నేను ఇంత చదివాను, అంత చదివాను కూడా కాదు.

నీకు మనీ ఉందా? 
సక్సెస్ ఉందా? 

ఉందా... ఓకే. 
లేదా... చల్ హట్! 

కట్ చేస్తే -  

డబ్బు చాలా ముఖ్యం. అది ఉంటేనే మనకు మర్యాద ఉంటుంది. 

దీనికి వ్యతిరేకంగా, "డబ్బుదేముంది?" అని నీతో ఎవరైనా అన్నారా... వెంటనే అక్కన్నించి పారిపో. 

పచ్చి అబద్ధం.  

ఎందుకంటే, డబ్బు సంపాదించినవాడెప్పుడూ ఆ మాట మాట్లాడడు. సంపాదించలేనివాడే ఈ మాట మాట్లాడుతాడు. లేదా, బాగా సంపాదించి, మనుషుల మనసులతో ఆడుకొంటూ టైమ్ పాస్ చేసేవాడే అలా మాట్లాడతాడు.

దురదృష్టవశాత్తూ, ఇలాంటి మాటలు, ఇలాంటి సాంగత్యం నువ్వు వెళ్ళాల్సిన గమ్యం వైపు నిన్ను తీసుకెళ్ళలేవు. 

సక్సెస్, మనీ ఉన్నచోటే గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది.   

99% శాతం మందికి ఇది నచ్చదు. హిపోక్రసీ మాస్కు వేసుకొని ఇది తప్పు అంటారు. నిజం కాదు అంటారు. కాని, ఇదే నిజం.

Money is a major area you absolutely must dominate — especially if you’re in cinema or any creative field.

- మనోహర్ చిమ్మని   

Tuesday, 10 February 2026

Comfort Is Killing You


According to a widely cited Pew research insight, a large majority of people live very close to where they grew up. Familiar streets, known faces, predictable routines—comfort quietly becomes a lifetime default.

But growth rarely happens in familiar places.

The most defining moves of life often begin the moment we step away from what feels safe. New cities challenge our identity, stretch our skills, and strip away excuses.

Comfort soothes—but it also limits. Obsession, ambition, and reinvention demand friction.

This truth isn’t limited to the U.S. It applies everywhere. Across cultures, countries, and careers, staying too close to comfort keeps potential dormant.

If you want to become dangerous—in thought, creativity, or courage—change your geography.

Sometimes, the fastest way to find yourself is to leave home.

Where did you grow up—and where is life calling you next? 

- Manohar Chimmani 

"సిండికేట్" సినిమా !!


ఇది ఆర్జీవీ ప్లాన్ చేస్తున్న "సిండికేట్" కాదు...  

ఫిలిం ఇండస్ట్రీలో ఒంటరిపోరాటాలకంటే, ఒక నలుగురైదుగురు లైక్‌మైండెడ్ కలిసి చేసే సినిమాలే బాగా సక్సెస్ అవుతాయని చెప్పే పోస్టు.   

ఒక్క సినిమాలోనే కాదు, ఏ ఫీల్డులో అయినా సరే, "సిండికేట్" అంటేనే సక్సెస్.  

ఒకటే బుర్ర కంటే, నాలుగు బుర్రలు యాక్టివ్‌గా పనిచేస్తూ, పవర్‌ఫుల్ నిర్ణయాలు తీసుకోగలుగుతాయి.  

ఇప్పుడు హేమాహేమీలుగా టాప్ పొజిషన్లలో ఉన్న ప్రొడ్యూసర్లలో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ప్రారంభంలో ఇలా ఒక సిండికేట్‌గా ఏర్పడి సినిమాలు చేసినవాళ్ళే.

వీరికి ఒంటరిగా చేసే సత్తా లేక కాదు. అదంతే. ఒక పెద్ద పనిని ఒక్కరే చేయటం కంటే, నలుగురు కలిసిచేయడం అన్నివిధాలా సులభంగా ఉంటుంది. 

ఇప్పటికీ మీరు చూడండి... దాదాపు ప్రతిసినిమాలో మెయిన్‌గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నా కూడా, దాని సమర్పణ ఒకరు చేస్తారు. నిర్వహణ ఇంకొకరుంటారు. సహనిర్మాత ఇంకొకరుంటారు. వీళ్లంతా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వాములే అన్నమాట. 

కట్ చేస్తే -

మంచి కంటెంట్‌తో ఒక చిన్న బడ్జెట్ సినిమా చెయ్యాలంటే ఒక 2 కోట్లు అవుతుందనుకుంటే, దాన్ని ఒక్కరే చేయనవసరం లేదు. ముగ్గురో నలుగురో లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్లు కలిసిచెయ్యొచ్చు. రిస్క్-ఫ్రీ ప్రాజెక్టుతో అత్యధికస్థాయిలో లాభాలు పొందొచ్చు.  

నిజంగా ఈ ఫీల్డువైపు ప్యాషన్ ఒక్కటే కాకుండా, ఒక బిజినెస్‌గా కూడా ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఆలోచించవచ్చు. "సిండికేట్" కావచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మీడియేటర్స్ కూడా ఈ "సిండికేట్" ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించవచ్చు. 

Want to know more? DM me.

- మనోహర్ చిమ్మని   

Monday, 9 February 2026

కొన్ని విషయాల్లో లాజిక్కుల జోలికి పోవడం వృధా!


"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అయితే, ఈ పేరు విషయంలో అప్పుడప్పుడూ నేను కూడా పార్టీలు మారుతుంటాను. అది వేరే విషయం. అది నా కంఫర్ట్.  

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 
మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా... శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన చక్రవర్తులు, రాజులు, రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్నదీ, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా నేను గమనించినదీ అయిన గొప్ప నిజం కూడా ఇంకోటుంది...   

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన వీరంతా చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక తత్వానికి లొంగిపోయారు. ఆశ్రమాల్లో చేరిపోయారు.   

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది. 
 
తప్పకుండా ఉంది. 

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి. 

"నాకే అన్నీ తెలుసు" అని ఎగిరెగిరిపడేవాళ్లకి ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తాయి. మరింత లోతైన ఆధ్యాత్మికస్థాయికి వెళతారు.    

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్... అని నేననుకుంటున్నాను... 

Logic doesn’t always belong to spirituality.
Nor to cinema.
Some things are meant to be felt.
Accept. Enjoy. Live—
because life is one.

- మనోహర్ చిమ్మని   

Saturday, 7 February 2026

బ్లాగింగ్ నిజంగా అదృశ్యమైపోతోందా?


సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కటిగా కొన్ని ఫేడవుట్ అయిపోతున్నాయి. వాటిల్లో మొదటిది వెబ్‌సైట్. రెండోది బ్లాగింగ్. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 600 మిలియన్ల బ్లాగ్స్ ఉన్నాయి. కాని, అంతకుముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు వీటికి లేదు. 

కేవలం కొంతమంది మాత్రం బ్లాగింగ్‌ను మరింత స్పెషలైజ్డ్‌గా తీర్చిదిద్దుతున్నారు. సోషల్‌మీడియా నుంచి బ్లాగ్‌లకు రప్పించుకుంటున్నారు. 

కట్ చేస్తే -

2012 ఆగస్టులో అనుకోకుండా ప్రారంభమైన నా ఈ బ్లాగింగ్ జర్నీ నాకెంతో ఇష్టం.  

నా స్ట్రెస్‌బస్టర్. నా థెరపీ. నా ధ్యానం. నా యోగా. 

"ఇది రాయటం అవసరమా" అని అనిపించిన విషయాలు కూడా ఎన్నో రాశాను నా బ్లాగులో.

అది వేరే విషయం. 

"ఇది పోస్ట్ చేస్తే అందరూ నన్ను ఏమనుకుంటారో అన్న సంఘర్షణ లేకుండా నా బ్లాగులో నేను ఒక్క పోస్ట్ కూడా పోస్టు చెయ్యలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్.

సో, ఈ విషయంలో నాకో సోపతి ఉన్నాడనుకున్నాను. 

బైదివే, ఆల్టుచర్ 'ఎక్స్‌'లో నా ఫాలోయర్ కూడా!

కట్ చేస్తే - 

బ్లాగింగ్ మానెయ్యాలని కనీసం ఒక డజన్ సార్లు అనుకున్నాను. కాని, మానుకోలేకపోయాను. తర్వాత నేనే అనుకున్నాను... ఎందుకు మానెయ్యాలి అని. 

అదేంటో గాని, నేను విచ్చలవిడిగా బ్లాగింగ్ చెయ్యటం తగ్గించాక కూడా ఈ మధ్య నా బ్లాగును చాలామంది చదువుతున్నారు! 

- మనోహర్ చిమ్మని  

Thursday, 5 February 2026

చిన్న బడ్జెట్ సినిమాలే రిస్క్-ఫ్రీ !!


మీరు గమనించారా... దాదాపు ప్రతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రెగ్యులర్‌గా చేస్తోందని? 

ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. లేదంటే, బయటి నుంచి ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ చేసిన చిన్న బడ్జెట్ సినిమాల్ని, పెద్ద నిర్మాతలు తీసుకొని, వాళ్ళ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. 

ఎందుకు?

రొటేషన్. 

భారీ సినిమాలు ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో అస్పష్టం. ఈలోగా చిన్న రేంజ్‌లో అయినా మనీ రొటేషన్ కావాలంటే చిన్న సినిమాలే కాపాడతాయి. 

భారీ బడ్జెట్ సినిమాలు గ్యాంబ్లింగ్ అయితే, చిన్న బడ్జెట్ సినిమాలు రిస్క్-ఫ్రీ. 

భారీ బడ్జెట్ సినిమాల్లో పోతే పదులు-వందల కోట్లు పోతాయి. చిన్న సినిమాలు ఫ్లాప్ అయినా, ఓటీటీలు ఇతర రైట్స్ ద్వారా మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే, బడ్జెట్ తక్కువ కాబట్టి.   

- మనోహర్ చిమ్మని  

Wednesday, 4 February 2026

Ayn Rand: From Hollywood Scripts to the Philosophy of the Self


Ayn Rand is often remembered as the fierce philosopher of Objectivism, but before The Fountainhead shook the literary world in 1943, she was already shaping stories in a different arena—cinema and theatre. 

She worked as a screenwriter in Hollywood and even had a play produced on Broadway in 1935–36.

Storytelling was not a detour for Rand. It was her laboratory.

Objectivism—her philosophy of reason, individualism, and creative self-interest—fits cinema like a glove. Films are born from a singular vision fighting odds: producers, markets, trends, fear. Rand believed that the creator must not dilute their truth to please the crowd. In that sense, every filmmaker faces the same choice her heroes did… compromise or conviction.

For artists in films, Rand’s life sends a powerful message. Cinema is not just entertainment. It is a moral statement. A director, writer, or actor who owns their voice, takes responsibility for their choices, and refuses to apologize for ambition is already practicing Objectivism—whether they name it or not.

On her 121st birthday (2nd Feb), Ayn Rand reminds us of this simple, uncomfortable truth... Great films, like great lives, are made by individuals who dare to stand alone.

- Manohar Chimmani